దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ తాజాగా కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మాట్లాడుతూ.. చాలా భారమైన మనస్సుతో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానన్నారు. ఫాంహౌస్ కు సంబంధించిన వీడియోలను సీజేఐ, సహా ప్రధాన న్యాయమూర్తులకు పంపినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఫాం హౌస్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర వివరాలు, 60 నిమిషాల వీడియో తెలంగాణ హైకోర్టు సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలతో.. దేశంలోని ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపాం.. ఇది అందరికీ తెలియాల్సిన విషయం.. సుప్రీంకోర్టు సహా.. అన్ని రాష్ట్రల హైకోర్టు న్యాయమూర్తులను చేతులు జోడిండి అడుగుతున్నా.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంటూ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్యమ సమయంలో కూడా మేం ఇలా వ్యవహరించలేదు.. ఏ వ్యవస్థను బీజేపీ లెక్కచేయడం లేదు.. ఇంత దిగజారడం కరెక్ట్ కాదు అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్య జరుగుతోంది. ఇండియా.. ఆకలి రాజ్యంగా మారుతుంది.. ఇది నేను చెప్పే మాట కాదు.. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నవి అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది.. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇంత దుర్మాంగం ఉంటుందా అనిపిస్తుంది అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version