సపాయన్న.. నీకు సలామన్నా 5 వేలు అదనపు వేతనం; కేసీఆర్

-

గ్రామ పారిశుధ్య కార్మికులకు 5000, జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు 7500 వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతం ఇస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిని, పోలీసులను, సఫాయి కార్మికులను ఆకాశానికి ఎత్తారు. సఫాయన్న నీకు సలామన్న అంటూ కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.

సఫాయి కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. తల్లి తండ్రుల తర్వాత వాళ్ళే గొప్ప వారని కరోనా కట్టడి కోసం సైనికుల కంటే ఎక్కువగా పోరాటం చేస్తున్నారని కేసీఆర్ అభినందించారు. వాళ్ళు ఎంత శుభ్రంగా పని చేస్తే అంత కరోనా కట్టడి లో ఉంటుందని వాళ్లకు ముఖ్యమంత్రి కానుకగా డబ్బులు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు. ఇప్పటికే వారికి నిధులు విడుదల చెయ్యాలని,

ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఇక వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. వాళ్ళను మనం గౌరవించాలని కేసీఆర్ కోరారు. అదే విధంగా లాక్ డౌన్ ని కొనసాగించాలి అని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version