ట్రంప్ మాటల్లో భయం…

-

ఒక పక్క ఎన్నికలు ముంచుకి వస్తున్నాయి. మరో పక్క కరోనా మహమ్మారి అమెరికాను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక ఇప్పుడు అమెరికా ఎంత ఆర్ధిక బలంగా ఉన్నా అంగ బలం ఉన్నా సరే చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా ఇప్పుడు కంటికి కనపడని వైరస్ తో కంటి మీద కునుకు లేకుండా బతుకుతుంది. వచ్చే వారం ఎలా గడుస్తుందో ఏంటో అని అక్కడి గవర్నర్లు కన్నీళ్లు పెడుతున్నారు.

కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ముందు వరకు చాలా ధీమాగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… ఇప్పుడు తడబడుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి సాయం కావాలని కోరుతున్నారు. మరో అగ్ర రాజ్యంగా ఉన్న రష్యాను కూడా ఆయన సహాయం అడిగారు. ఆ రెండు దేశాలుగా దశాబ్దాలుగా వాతావరణం వేడిగా ఉంటుంది. అయినా సరే ట్రంప్ మాత్రం మాకు సహాయం చేయండి అని ఆ దేశాన్ని కోరారు.

మన దేశాన్ని కూడా మందు కోసం కూడా సహాయం అడిగారు ట్రంప్. కాని మన దేశం మాత్రం సహాయం చేయడానికి ముందుకి రావడం లేదు. ఎన్నికల ముందు ట్రంప్ లో తడబాటు కనపడుతుంది. ధీమాగా ఉండే ట్రంప్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. తాను చెప్పాలి అనుకునేది చెప్పే ట్రంప్ ఇప్పుడు అది చెప్పడం లేదు. ఆత్మరక్షణ లో మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలు తమకు సహాయం చేస్తాయని నమ్మారు.

65 దేశాలకు భారీగా ఆర్ధిక సహాయం చేసారు. అయినా సరే ఏ దేశం ముందుకి రావడం లేదు. ట్రంప్ ఓటమిని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి కాబట్టే ఇప్పుడు ముందుకి రావడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అమెరికా తన చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా సంక్షోభం ఎదుర్కొంటుంది. ఇప్పుడు గనుక అమెరికా నిలబడకపోతే మాత్రం ఆ ప్రభావం ప్రపంచం మీద చాలా గట్టిగా పడే అవకాశాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version