ఈ అరాచకాన్ని మేమెందుకు భరిస్తాం.. మా రాష్ట్రానికి వచ్చి.. మమ్మల్ని కూలగొడతాం అంటే ఊరుకోబోమని.. దేశవ్యాప్తంగా పోరాడుతామని తెలిపారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు ప్రయత్నించారని.. వారికి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వీటన్నింటిపై లెక్కలు తేల్చాలని ఆనాడే ఆప్ ఈడీని కోరిందన్నారు. పార్టీ మారితే వందకోట్లు ఇస్తామన్నారని.. వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని హామీనిచ్చారని.. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉందని, కాపాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కొక్కరికీ మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి.. అవన్నీ బట్టబయలు అయ్యాయని తెలిపారు.
తుషార్ అనే వ్యక్తి కేంద్ర హోంమంత్రికి సన్నిహితుడు అని కేసీఆర్ తెలిపారు. రామచంద్ర భారతి.. రోహిత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం.. మరికొన్నింటిని పడగొడతాం అంటూ పేర్కొన్నారు. ఈ ముఠాలో 24 మంది ఉన్నారు.. పెద్ద క్రైం.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఆధార్ కార్డులతో సహా అన్ని ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలను కూడా లైవ్‌లో విడుదల చేశారు సీఎం కేసీఆర్.