నేతన్నలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌…రైతులలాగే రూ. 5 లక్షల బీమా

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇవాళ రాజన్న సిరిసిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. అనంతరం అధికారులు సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌… నేత కార్మికులకు తీపి కబురు చెప్పారు.  చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. త్వరలో చేనేత కార్మికులకూ రైతు బీమా లాంటి పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

రైతుల్లాగే చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప చేసేలా పథకం తీసుకువస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. గతంలో సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కన్నీళ్లు పెట్టించేవని పేర్కొన్నారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరల ఆర్డర్‌ లు ఇచ్చామని చెప్పారు సీఎం కేసీఆర్‌.  రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ వారికి ఏమీ చేతకాదనే అనేవారని.. కానీ ఇప్పుడు బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చూసి.. వలసవెళ్లిన వారు వెనక్కి వస్తున్నారని చెప్పారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version