కట్టప్ప గురించి తెలుసా ఈ సన్నాసికి : కేసీఆర్‌..

-

తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అప్రమత్తమైన అధికారులు ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉండనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ భారీ వర్షాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే.. అనంతరం మీడియాతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతలపైన, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు… ఆమెకు థాంక్స్ అని.. ఈ దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ఆయన మండిపడ్డారు.

దేశంలో తమాషా చేస్తున్నారా.. ఇంత అధ్వాన్నమా అంటూ కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లా ప్రభుత్వాలను కూలగొట్టారు అని మహారాష్ట్రనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలివి తప్పి మతిమాలి లక్ష్మణ్ మాట్లాడుతున్నారని, కట్టప్ప గురించి తెలుసా ఈ సన్నాసికి అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి కుక్క మూతి పిందెలా దేశానికి కావాల్సింది అంటూ ఆయన మండిపడ్డారు. నిన్న మహారాష్ట్రలో 20 శాతం విద్యుత్ ఛార్జ్ లు పెంచారని, ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారా అంటూ.. సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. భయంకర కరెప్షన్, అప్రజాస్వామిక విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version