దళితులకు ఆ బాధ పోవాలే: సీఎం కేసీఆర్

-

హైదరాబాద్: సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత ఎంపవర్‌మెంట్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని తెలిపారు. అందుకు బాధ్యులు పాలకులే అవుతారని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా ఆర్థికంగా పీడిత వార్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు అని కేసీఆర్ తెలిపారు. ఆ బాధ పోవాలని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాము కూడా ‘పురోగమించ గలం’ అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవలన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో సూచనలు చేయాలని ఆల్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా సూచించారు.

సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం దళిత ఎంపవర్ మెంట్.. సమావేశం‌లో ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎం ఐ ఎం పార్టీ యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు డి. రాజేశ్వర్ రావు, గోరటి వెంకన్న, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క్ సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆలంపూర్ ఎమ్మెల్యే విఎం అబ్రహం, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపి మంద జగన్నాథం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. సూచనలు, సలహాలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version