తెలంగాణ భాష అంటే ఒకప్పుడు సినిమాల్లో జోకర్లకు, విలన్లకు వాడే వారని.. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమాల్లో హీరోలు క్లిక్ అవుతున్నారని అన్నారు సీఎం కేసీఆర్. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు విషయాలు ప్రధానంగా భాష పరిరక్షణ జరిగిందని… తెలంగాణ కల్చర్ బతుకమ్మ, పోచమ్మ, బోనాలు ఇలా నిధులను కేటాయించామని అన్నారు. తెలంగాణలో నీటి గోస పోయిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాగిందని ఆయన అన్నారు. ఎన్నో పండగలను రాష్ట్ర పండగలుగా గుర్తించామని.. మేడారం, బోనాల పండగకు నిధులు కేటాయిస్తున్నామని ఆయన అన్నారు. గోదావరి నీళ్లతో నిజాం సాగర్ నింపుతున్నామని అన్నారు. మన నిధులు బడ్జెట్ ద్వారా మన రాష్ట్రానికి కేటాయిస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగకపోవడంతో దేవుడి ఆశీస్సులతో తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ తనను తాను పునరుద్ధరించుకోవాలని ఆయన అన్నారు. ఎవరు ఏమన్నా… కొంతమంది రాజకీయాల కోసం పనిచేసేవారిని, నన్ను విమర్శించిన వారిని కూడా పట్టించుకోనని అన్నారు.