ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెసుకన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అకాల వర్షాలు, వడగళ్ల వానతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి పంట, మిర్చి పంటలు నెలకొరిగాయి. రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటను రేపు సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల, నర్సంపేట డివిజన్లలో పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. సీఎంతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సీఎం వెంట ఉండనున్నారు. తాజాగా ఆరోజు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్ లో వ్యవసాయం గురించ చర్చ రాగా… వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన గురించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.