తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కరోనా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇవాళ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. చికిత్సకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న అంశాలపై గవర్నర్‌కు కేసీఆర్ వివరించనున్నారు.
ఇక సచివాలయ కూల్చివేతను దాదాపుగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం… త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణంపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అంతకుముందే ఈ అంశంపై సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై నిర్వహించాలని భావించిన కరోనా సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది.