సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దసరా పండుగ కోసం తన సొంతూరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన ఆయన ఆ తర్వాత ఆదివారం కొడంగల్‌లో పర్యటించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు ఆర్గనైజ్ చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకుని అక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. 2023లో ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాగా.. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు కంపెనీ నిర్ణయించింది. ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు తెలిపారు.