తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా పండుగ కావడంతో…తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. తెలంగాణలో రూ. 1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు…జోరుగానే సాగాయి.
ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలపడం జరిగింది. అయితే.. ఇది ఇలా ఉండగా.. కింగ్ ఫిషర్ బీరులో నలకలు ఉన్నాయంటూ.. మందుబాబులు తాజాగా ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీశారు మందుబాబులు. ఈ వీడియో వైరల్ గా మారింది.