సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలం పార్టీ ఆయన మీద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేసినట్లు సమాచారం. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రస్తుతం ఈ కేసు ఉన్నది. హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టుకు సీఎం రేవంత్ విన్నవించారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. కాగా, 2024 మే 5న కొత్తగూడెంలో నిర్వహించిన ‘జన జాతర’ సభలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే SC, ST రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని..ఈ మేరకు అమిత్ మా అన్నట్లు ఓ ఫేక్ వీడియోను ప్రదర్శించారు. దీంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.