వివిధ రంగాల్లో విశేషంగా సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యుత్తమ పురస్కారాలను శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో తెలుగువారికి సైతం చోటు దక్కింది. ఈ క్రమంలోనే వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘జాతీయ అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన డాక్టర్ శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి… పద్మభూషణ్ కు ఎంపికైన ప్రముఖ నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ.. పద్మశ్రీకి ఎంపికైన శ్రీ మందకృష్ణ మాదిగ, శ్రీ కెఎల్ కృష్ణ, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ మిరియాల అప్పారావు, శ్రీ వద్దిరాజు రాఘవేంద్రాచార్యులకు నా హృదయపూర్వక అభినందనలు’ అని రాసుకొచ్చారు.
జాతీయ అత్యుత్తమ పురస్కారాలు పద్మ విభూషణ్ కు ఎంపికైన డాక్టర్ శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి…
పద్మభూషణ్ కు ఎంపికైన ప్రముఖ నటుడు
శ్రీ నందమూరి బాలకృష్ణ…పద్మశ్రీకి ఎంపికైన శ్రీ మందకృష్ణ మాదిగ, శ్రీ కెఎల్ కృష్ణ,శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ మిరియాల అప్పారావు,శ్రీ వద్దిరాజు…
— Revanth Reddy (@revanth_anumula) January 26, 2025