రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. సాగు నీరు రాక ఒక మహిళా రైతు.. అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వికారాబాద్ జిల్లా పరిగి మండలం సజీరాబాద్ తండాకు చెందిన కట్రావత్ భారతి అనే మహిళా రైతు గత ఏడాది ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసింది. తనకున్న రెండు ఎకరాల పొలానికి సాగు నీరు అందక పంట ఎండిపోయే స్థితికి వచ్చింది.దీంతో మనస్తాపంతో పొలంలోనే విద్యుత్ టవర్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన సుప్పరి మాణిక్యం (49) అనే రైతుకు రైతు భరోసా రాక, రుణమాఫీ అవ్వక, కొడుకు కొలువు వస్తుందని నమ్మకం లేక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాష్ట్రంలో ఆగని రైతు ఆత్మహత్యలు
సాగు నీరు రాక ఒక మహిళా రైతు.. అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సజీరాబాద్ తండాకు చెందిన కట్రావత్ భారతి అనే మహిళా రైతు గత ఏడాది ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసింది.
తనకున్న రెండు ఎకరాల పొలానికి సాగు నీరు అందక పంట ఎండిపోయే… pic.twitter.com/yYkWz9OpmZ
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2025