మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు స్వయంగా రచించిన ‘ఉనిక’(స్వీయ చరిత్ర) పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కే.హరిబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుస్తకం ఆవిష్కరించారు.
సీనియర్ సంపాదకులు ‘ఉనిక’ పుస్తకంలోని కీలక అంశాలను విశ్లేషించారు. కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.సుబ్బరామి రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎంపీ జీ.వినోద్‌లు కూడా హాజరయ్యారు. వీరంతా విద్యాసాగర్ రాజకీయ, జీవిత ప్రస్థానంలోని విశేషాలను గుర్తు చేస్తూ ఆయన స్వీయ చరిత్ర అయిన పుస్తక రచనను ప్రశంసించారు.