ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి… రేపు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాలో పాల్గొంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలని ఒత్తిడి పెంచే పనిలో కాంగ్రెస్ పడింది. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా రానున్నారు.

ఇక అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాశ్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీ బయలుదేరారు. రేపు ఢిల్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ధర్నా చేయనున్నారు.