గ్యాంగ్ రేప్ ఘటనపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఎంఎంటీఎస్, ఊర్కొండపేటలో లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు, మహిళా సంక్షేమ అధికారులతో మాట్లాడిన ఆమె కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఊర్కొండపేటలో అత్యాచార ఘటనాస్థలాన్ని ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఐజీ తెలిపారు. కాగా విదేశీ యువతిపై అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. నిన్న మీర్ పేట్లో జర్మన్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అస్లాం.
మార్చి తొలి వారంలో హైదరాబాద్ కు జర్మన్ యువతి, యువకుడు వచ్చారు. స్నేహితుడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శిస్తున్నారు యువతి, యువకుడు. నగరాన్ని చూపిస్తానంటూ జర్మనీ యువతి, యువకుడిని కారులో తీసుకెళ్లిన అస్లాం… ఫోటోలు దిగేందుకు కారు నుంచి దిగాడు జర్మనీ యువకుడు. కార్ యూ టర్న్ తీసుకొద్దామని జర్మనీ యువతిని కారులో తీసుకెళ్లిన అస్లాం … నిర్మానుష్య ప్రాంతంలో యువతిపై అత్యాచారం చేసాడు.