గోషామహల్ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31న గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలు ఉండాలి అని పేర్కొన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పార్కింగ్, మార్చురీ, ఇతర సౌకర్యాలు ఉండాలి అని పేర్కొన్నారు. అలాగే అదిఆరులకు రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులు సూచించారు సీఎం రేవంత్. లే అవుట్, బిల్డింగ్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని.. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా నిర్మాణాలు ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు తెలిపారు.