గత ప్రభుత్వంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి కి 100 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఇప్పటివరకు పనులు చేపట్టలేదు అని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేయించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయకుండా, తొర్రూరు పట్టణ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం ఏంటి. 100 పడకల ఆస్పత్రికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే, విరాళాలలు సేకరించి 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం. ప్రభుత్వ హాస్పటల్ కు దేవాదాయ శాఖ సంబంధించిన 5 ఎకరాల భూమిని కేటాయించి నిర్మాణం చేపట్టాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొర్రూరు మున్సిపాలిటీ ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. జూట, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. కనీసం మంత్రి వి కూడా కాలేని నువ్వు, అబద్దాలతో రేవంత్ రెడ్డి సాధించింది, ఒకే ఒక్కటి ముఖ్యమంత్రి పదవి మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన మెగా కృష్ణారెడ్డి తో ఒప్పందం చేసుకోవడం కోసమే ఎర్రబెల్లి పేర్కొన్నారు.