గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

-

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారమన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy inaugurated Microsoft’s new campus in Gachibowli

మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నానని ప్రకటించారు. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ADVANTA(I) GE TELANGANA ను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news