జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందని వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..పెట్టారు. ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీటింగ్ జరిగింది.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి ఎంపిక, ప్రచారం, నాయకుల మధ్య సమన్వయంపై నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని కోరారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.