ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి రెచ్చిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. దొంగే దొంగ అన్నట్టు ఉంది కడియం వ్యవహారం అంటూ ఆగ్రహించారు. కడియం శ్రీహరి నా వెంట్రుక కూడా పీకలేడని చురకలు అంటించారు.

ఆరు నూరైనా ఘనపూర్ కు ఉపఎన్నిక రావడం ఖాయం అన్నారు. ఉపఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేసి, పర్వతగిరికి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి కామాంధుడని ఆయన అనుచరులే చెబుతున్నారు… హనుమకొండలో, పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు తాటికొండ రాజయ్య. ఘనపూర్ నియోజకవర్గంలోని భూములను కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. దేవునూరు భూముల అన్యాయంగా కబ్జా చేయాలని కడియం శ్రీహరి చూస్తున్నారని అన్నారు.