తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు (ఆదివారం) ఢిల్లీకి పయనం కానున్నారు.ఆయన కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భేటీలో పాల్గొంటారు. తీవ్రవాద నిరోధంపై ప్రత్యేకంగా కేంద్రహోంశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలతో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ఆస్తి, పంటనష్టం వాటిల్లింది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కోసం నివేదికను సైతం పంపించారు.రూ.10వేల కోట్లు మేర అంచనా వేయగా.. కేంద్రం నుంచి కేవలం రూ.500 కోట్లు మాత్రమే వరద సాయంగా వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ పలువురు కేంద్రమంత్రులతో చర్చించి మరింత సాయం చేయాలని కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలుస్తారని తెలుస్తోంది.