సామాన్యుడికి ధర పుట్టిస్తున్న కూరగాయల ధరలు..ఏకంగా రూ.100కు చేరువలో!

-

అకాల వర్షాల వలన మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.దీంతో పేద,మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతోంది. వారి స్తోమతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూరగాయాల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.కొందరైతే కూరగాయాల కొనేందుకు ధైర్యం రాక ఉట్టిచేతులతో ఇంటి దారి పడుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

వర్షాల వలన దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూరగాయాల ధరలు ఏకంగా రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే టమోటా రూ.100 పలుకుతోంది. ఏపీ, తెలంగాణలో గత వారం ఉల్లి కేజీ రూ.60 ఉండగా.. ఇప్పుడు రూ.80కి చేరింది. టమోటా గతవారం కేజీ రూ.50 నుంచి60 మధ్యలో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.100 పలుకుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రూ.80 నుంచి 90 మధ్య పలుకుతోంది. దసరా పండుగ నాటికి అన్ని కూరగాయాలు రూ.100 చేరువ కావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news