నేడు 11 గంటలకు ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి… తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీకి వెళ్లనున్నారు.

అటు కేసీఆర్ ఫ్యామిలీపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కాదు కల్వకుండా..! అని కేసీఆర్ కు కొత్త పేరు పెట్టారు రేవంత్ రెడ్డి. బీసీలు ఓసీలు కల్వకూడదు… ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు.. హిందువులు, మైనార్టీలు కల్వకూడదు.. ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.