తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణ రాష్ట్రంలో బంద్ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు తాజాగా ప్రకటన చేశాయి. ఏకంగా 1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో… సెప్టెంబర్ ఒకటి అంటే ఇవాళ అర్ధ రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రులు లేక కూడా రాశాయి.

దీనిపై ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇవాళ అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ అవుతాయని వెల్లడించారు. బిల్లుల పెండింగ్ తో చిన్న అలాగే మధ్య స్థాయి ఆసుపత్రిలో మూసివేసే పరిస్థితి నెలకొందని కూడా వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.