రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

-

REVANTH REDDY: రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్న సీఎం… సాయంత్రం హైదరాబాద్ కు వస్తారు.

Telangana state government writes to Union Home Ministry seeking CBI probe into Kaleshwaram project
Telangana state government writes to Union Home Ministry seeking CBI probe into Kaleshwaram project

ఇక ఇవాళ భద్రాచలంలో పర్యటించిన రేవంత్.. బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వెనుక తానులేనని.. వాళ్లలో వాళ్లే కత్తులు పట్టుకుని పొడుచుకుంటున్నారని.. బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. చేసిన పాపాలు ఎక్కడికీ పోవూ…ఆనాడు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈరోజు దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో గొడవలు వచ్చి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు…నేను ఆ చెత్త గాళ్ల వెనక ఎందుకు ఉంటాను? అని కౌంటర్ ఇచ్చారు. నేను నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం నాయకుడిగా ముందుంటా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news