ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పి మరి చాలా నిజాయితీగా ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో రకాల అద్భుతాలను సాధించిందని అన్నారు.
కానీ 21 నెలల కాంగ్రెస్ పాలనతో ఏ వర్గము సంతోషంగా లేదని విమర్శించారు. రైతులు యూరియా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సహా దేశమంతా సీబీఐ, ఐటీ, ఈడీ బీజేపీ జేబు సంస్థలని దుమ్మెత్తిపోస్తుంటే..రేవంత్ రెడ్డి ఏమో.. సీబీఐ ఒక అద్భుతమైన సంస్థ అని చెప్పి విచారణను వాళ్లకు అప్పగించాడని ఆగ్రహించారు కేటీఆర్. కాళేశ్వరము, కమీషను, ఈ-ఫార్ములా కేసు అంటూ.. రేవంత్ రెడ్డి ఒకటే పనికిమాలిన ముచ్చట మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు.