స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నాయకులు పని చేయాలని.. కార్యకర్తల్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తల్నే కుర్చీలో కూర్చొబెట్టాలనే నేతలకు చెప్తున్నానని తెలిపారు.నాకు వచ్చిన ముఖ్యమంత్రి పదవి కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితమేనని అన్నారు.
కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తల్ని తప్పకుండా అదుకుంటామని అన్నారు. గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడుల సమయంలో కేసీఆర్ రాజనీతి ఎక్కడ పోయిందని ,కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందని అన్నారు.