కేటీఆర్, హరీశ్ రావు దీక్షకు కూర్చోవాలి: సీఎం రేవంత్

-

డీఎస్సీ పరీక్షల వాయిదా డిమాండ్లో న్యాయం ఉంటే కేటీఆర్, హరీశ్రరావు దీక్షలో కూర్చోవాలని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. ‘ఎప్పుడు పేద విద్యార్థులే ఎందుకు నిరాహార దీక్షలు చేయాలి. ఈసారి దీక్ష చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులను నిరుద్యోగులు ఆహ్వానించాలి. వారిద్దరూ దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయంగా బలహీనం అయినప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేశాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన తన పార్టీలో చేర్చుకోలేదా? ఈ ప్రభుత్వం 3 నెలలకే కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనలేదా? ఇక ఆయనకు రాజకీయ మనుగడ లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version