నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్న సీఎం… నేడు సాయంత్రం హైదరాబాద్ కు వస్తారు. షెడ్యూల్ ఫిక్స్ అయింది.

కామారెడ్డి జిల్లా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్
- ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి లింగంపేట మండలం మోతె గ్రామానికి బయలుదేరనున్న ముఖ్యమంత్రి
- వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించనున్న రేవంత్ రెడ్డి
- మధ్యాహ్నం 1.10 గంటలకు కామారెడ్డి టౌన్ లోని జీఆర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించనున్న సీఎం
- మధ్యాహ్నం 2.20 గంటలకు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష