ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలన్న ఈసీ… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా కేంద్ర తాజాగా చేసిన జీఎస్టీ స్లాబ్ సరవరణను స్వాగతించిన సీఎం చంద్రబాబు… పేదల అనుకూల, అభివృద్ధి ఆధారిత నిర్ణయం అన్ని వర్గాలకు మేలు చేస్తుందని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఈ గొప్ప మార్పుకు ముందడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిచిన చంద్రబాబు… ఈ మార్పు ప్రతి భారతీయ పౌరుడు జీవన ప్రమాణాలు వృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు.