హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న గంటసాల విగ్రహం పక్కనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతిక శాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు.

త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా, కరోనా సమయంలో 2020, సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్ను మూసిన సంగతి తెలిసిందే. బాలసుబ్రమణ్యం తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి తన మధురమైన గొంతుతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో సినీ పరిశ్రమ ఇప్పటికీ ఆయన లేని లోటును తీర్చలేక పోతోంది. శారీరకంగా ఆయన ప్రజలందరికీ దూరమైన తన పాటలతో, మధురమైన స్వరంతో అభిమానులకు ఎప్పుడు చేరువలోనే ఉంటాడు.