టాలీవుడ్ హీరోయిన్ హన్సికకు బిగ్ షాక్.. మరదలు పెట్టిన వేధింపుల కేసులో హన్సికకు ముంబైలోని సెషన్స్ కోర్టులో చుక్కెదురు అయింది. హన్సిక తమ్ముడు ప్రశాంత్ మోత్వానీకి, టీవీ నటి ముస్కాన్‌కు 2020లో వివాహం చేసుకుంది. కొంతకాలానికే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు దంపతులు.

ఈ క్రమంలో తనను భర్త ప్రశాంత్, అత్త, ఆడపడుచు అయిన హన్సిక తీవ్రంగా వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్కాన్. తనపై ఉన్న కేసును పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హన్సిక. తాజాగా దీనిపై విచారణ జరిపి.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.