ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షణ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమకు ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేలును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు చాయ్ తాగేలోపు తమ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్షణ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేదాక దీక్షలను విరమించబోమని ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు.