సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య త్వరలోనే మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్-వైజాగ్‌ల మధ్య నడిపేందుకు 20 బోగీల వందే భారత్ రైలు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైజాగ్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లి తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకోవడంతో వందే భారత్ రైలు ట్రయల్ రన్ పూర్తి చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలులో 18 ఏసీ చైర్‌కార్ బోగీలతో పాటు, 2 ఎకానమీ బోగీలు ఉండనున్నాయి.
అయితే, సికింద్రాబాద్-విశాఖల మధ్య వందే భారత్ రైలు జర్నీకి ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. ఇప్పటికే 20 కాషాయ రంగు బోగీలతో ఓ వందేభారత్ రైలు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం బయల్దేరి వెళ్లే 16 బోగీల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో కొత్త రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.