బాబుకు బర్త్ డే విషేస్… రకరకాలు!

-

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నారు. ఈ శుభాకాంక్షల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చెబుతున్న శుభాకాంక్షలు ఒకెత్తు అయితే… సోషల్ మీడియా వేదికగా వెలువడుతున్న వెటకారపు విషెస్ మరో రకంగా ఉన్నాయి! ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు ఒకరకంగా ఉంటే… విజయసాయి విషెస్ మరోరకంగా ఉన్నాయి!

ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాంకాంక్షలు తెలిపారు. ‘‘అహర్నిశలు ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుణ్ని కోరుతున్నాను అని అన్నారు.

ఇవన్నీ ఒకెత్తు అయితే… వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం చంద్రబాబుకు వెటకారంతో కూడిన విషేస్ చెప్పారు! చంద్రబాబు జన్మదినం సందర్భంగా… “ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవడం లేదు.. ఆయనకు దేవుడు బుద్దీ జ్ఞానం ప్రసాదించాలని కూడా కోరుకోవడం లేదు”.. అంటూ మొదలుపెట్టిన ఆయన “చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ “ఇలాగే ఉండాలని” మాత్రమే కోరుకుంటునాం” అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెలిపారు!

ఇదే క్రమంలో ప్రస్తుతం కరోనా సమస్యతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఉండలేని పరిస్థితిలో ఉన్న బాబుకు సోషల్ మీడియాలో కూడా వెటకారపు శుభాకాంక్షలు వెళ్లివెత్తుతున్నాయి. “ఇలాంటి పుట్టిన రోజులు” ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆన్ లైన్ జనాలు!

ఆ సంగతులు అలా ఉంటే… ఈ సమయంలో… ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు “మనలోకం.కాం” కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది!

Read more RELATED
Recommended to you

Exit mobile version