దసరా నాటికి ప్రపంచం అంతా గుడ్ న్యూస్ వింటుందా ?

-

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. రెండు నెలల క్రితం చైనా కే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. వైరస్ ఎక్కువగా ప్రమాదకర స్థాయిలో అమెరికా దేశంలో విజృంభిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు, మరోపక్క మరణాలు అమెరికాలో ఊహించని విధంగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ఈ వైరస్ కోసం ప్రపంచమంతా విరుగుడు చూస్తోంది. చాలా మంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు, పరిశోధనలు జరపడంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రయల్స్ 18 నుండి 55 సంవత్సరాల వారిపై ప్రయోగించడానికి రెడీ అవుతున్నట్లు తెలిపారు.

 

అంత సక్సెస్ అయితే వచ్చే అక్టోబర్ లో అనగా మన దేశంలో దసరా సంబరాలు జరిగే సమయంలో ప్రపంచమంతా గుడ్ న్యూస్ వింటుందని ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలలో చాలా ఫలితాలు సానుకూలంగా వస్తున్నట్లు.. కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనలపై వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పై జరుగుతున్న అన్ని పరిశోధనల్లో కెల్లా ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చేసే పరిశోధనపై చాలామంది పాజిటివ్ గా ఉన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version