73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరంచారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా జెండాను ఆవిష్కరించారు.
మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అందుకే… ఆ మహానుభావుల ప్రేరణతోనే నేను నవరత్నాలు పథకాన్ని రూపొందించా… అని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరంచారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం… విధి నిర్వహణలో భాగంగా… ఎంతో సాహసాన్ని ప్రదర్శించిన రాష్ట్ర పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు.
అనంతరం… సీఎం జగన్ ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు పూర్తయినా.. ఇంకా నేటి సమాజంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా ఉన్నాయి. కులాలు, మతాల పేరుతో ఇంకా ప్రజలకు అన్యాయం జరుగుతోంది. అందుకే… అటువంటి వాళ్ల కోసం నామినేటెడ్ పోస్టులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సచివాలయాలు తీసుకొస్తున్నామని… మద్యపానాన్ని నిషేధించేందుకు నూతన మద్య విధానాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
(Video Courtesy: Sakshi TV)