కరోనా పై సీఎం జగన్ కీలక సూచనలు…!

-

కరోనా పై ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ కీలక సూచనలు చేశారు. పోస్ట్ కోవిడ్ కేసులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తు జగన్ నిర్ణయం తీసుకున్నారు. 15రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో కోవిడ్ హెల్ప్‌ డెస్క్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్‌ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఆప్యాయంగా, చిరునవ్వుతో పేషెంట్‌ను రిసీవ్‌ చేసుకోవాలని ఇవన్నీ విధివిధానాల్లో ఉండాలని ఈ 4 పారా మీటర్స్‌ మీద ప్రతిరోజూ రిపోర్ట్‌ రావాలన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 70 వేల టెస్టులు చేస్తున్నాం అని పాజిటివిటీ రేటు బాగా తగ్గిందన్నారు.
వారం క్రితం 5.5 ఉన్న పాజిటివిటి రేటు ఇప్పుడు 4.76గా ఉందన్నారు. 10శాతం కేసుల్లో కోవిడ్‌ వచ్చివెళ్లిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.కరోనా తర్వాత కిడ్నీ సమస్యలు, హార్ట్, చెవుడు వంటి సమస్యలు కూడా వస్తున్నట్లు హెల్త్ ఎక్స్ పర్ట్ చెప్పారన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే 10 రోజులు డ్రైవ్‌ చేపట్టాలన్నారు. కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని…104 కాల్ సెంటర్, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవడం వంటి నాలుగు అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version