తాడేపల్లి అంధ బాలిక హత్యపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు

-

గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అంధురాలు అయిన ఓ బాలిక తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆ బాలిక ఇంటి సమీపంలో ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత తల్లి వచ్చేసరికి మృతి చెందింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు గంజాయి సేవించాడని, ఇది శాంతి భద్రతల వైఫల్యమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ అంధబాలిక హత్యపై హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బాలికను గంజాయి మత్తులో హత్య చేయలేదని.. వ్యక్తిగత కక్షతోనే ఆ బాలికను హత్య చేశారని అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదన్నారు హోంమంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version