రవితేజ – కృష్ణ వంశి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పగలు ఉన్నాయా! వైరల్ అవుతున్న వీడియో

-

టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగిన వారిలో రవితేజ మరియు కృష్ణ వంశి కూడా ఉన్నారు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరుకు నిన్నే పెళ్లాడుతా, సిందూరం , ఖడ్గం, సముద్రం వంటి సినిమాలు వచ్చాయి..వీటిల్లో ఒక్క ఖడ్గం సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాలలో రవితేజ సైడ్ ఆర్టిస్టు రోల్ నే ఇచ్చాడు కృష్ణ వంశి..కృష్ణ వంశి డైరెక్టర్ కాకముందు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు..ఈయనతో పాటు రవితేజ మరియు పూరి జగన్నాథ్ లు కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసేవారు..అలా ముగ్గురు ఒక్కే చోట పని చేస్తుండే లోపు వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది..కృష్ణ వంశి డైరెక్టర్ అయినా తర్వాత రవితేజ అతని క్రింద కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు..అక్కినేని నాగార్జున మరియు కృష్ణ వంశి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

ఈ సినిమా ద్వారానే రవితేజ ని మొట్టమొదటిసారి వెండితెర కి పరిచయం చేసాడు కృష్ణ వంశి ..ఇందులో రవితేజ పాత్ర చాలా చిన్నదే అయ్యినప్పటికీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం బాగానే పడ్డాడు..ఇక ఆ తర్వాత ఆయనకీ మెల్లగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి..అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ రవితేజ నేడు ఏ స్థానం లో కొనసాగుతున్నాడో మన అందరికి తెలిసిందే..అయితే ప్రాణ స్నేహితులు లాగ ఉండే రవితేజ – కృష్ణవంశి కి ఈమధ్యనే పెద్ద గొడవలు అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పుకారు తెగ షికారు చేస్తుంది ..ఒకరినొకరు కొట్టుకునే రేంజ్ కి ఈ గొడవ వెళ్లినట్టు ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..వీళ్ళ మధ్య ఆ స్థాయిలో గొడవలు రావడానికి కారణం ఏమిటి అనే విషయం తెలియకపోయిన ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కృష్ణ వంశి రవితేజ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ చూస్తే కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అని అర్థం అయ్యిపోతాది.

ఇక అసలు విషయానికి వస్తే కృష్ణ వంశి తెరకెక్కించిన నిన్నే పెళ్లాడుతా సినిమా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు కృష్ణ వంశి..ఈ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను మరియు అనుభవాలను పంచుకున్నాడు..ఆ సమయం లోనే యాంకర్ రవితేజ గురించి అడుగుతూ ‘మీకు రవితేజ గారికి మధ్య మంచి సన్నిహిత్య సంబంధం ఉన్నట్టు ఉంది..ఆయనని తొలిసారిగా హీరో గా సిందూరం సినిమా ద్వారా పరిచయం చేసింది మీరే..అలాగే నిన్నే పెళ్లాడుతా సినిమాలో రవితేజ గారిని మొట్టమొదట సిల్వర్ స్క్రీన్ మీద పరిచయం కూడా చేసింది మీరే..మీ మధ్య ఉన్న అనుబంధం గురించి ఒకసారి చెప్పండి’ అంటూ అడగగా కృష్ణ వంశి రవితేజ గురించి మాట్లాడడం ఇష్టం లేక ‘నెక్స్ట్ క్వశన్ ప్లీజ్’ అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశారు..పాపం యాంకర్ రవితేజ గురించి అంత ప్రత్యేకంగా పనిగట్టుకొని అడిగితె కృష్ణ వంశి ఇలా రవితేజ గురించి మాట్లాడకుండా తప్పుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం..ఇది చూస్తుంటే కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అనే విషయం అర్థం అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version