చంద్రబాబు పర్యటనలో ఘర్షణ.. టీడీపీ, వైసీపీ నేతల ఫైట్‌

-

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌టిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం రాళ్ల‌తో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఓ ఎస్సైతో పాటు ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. అయితే స‌మాచారం తెలుసుకున్న పోలీసు ఉన్న‌తాధికారులు మ‌రిన్ని బ‌ల‌గాల‌ను అక్క‌డికి పంపి… ఇరు వ‌ర్గాల‌ను చెద‌రగొట్ట‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వచ్చింది. 3 రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్పం ప‌రిధిలోని రామ‌కుప్పం మండ‌లానికి చేరుకున్నారు చంద్ర‌బాబు.

ఈ సంద‌ర్భంగా ఓ వైపు చంద్ర‌బాబు టూర్ కొన‌సాగుతుండ‌గానే… మండ‌లంలోని కొల్లుప‌ల్లెలో చంద్ర‌బాబు వ‌చ్చే మార్గంలో వైసీపీ శ్రేణులు జెండాల‌ను క‌ట్టాయి. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీడీపీ శ్రేణులు ఆ జెండాల‌ను తొల‌గించే య‌త్నం చేయ‌గా…వారిపై వైసీపీ శ్రేణులు దాడుల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టిన పోలీసులు… వైసీపీ శ్రేణుల‌ను ఓ ఇంటిలో నిర్బంధించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. ఈ ఘర్ష‌ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. కుప్పం నా నియోజ‌క‌వర్గం అని గుర్తు పెట్టుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు చంద్ర‌బాబు. కుప్పంలో అతిగా ప్ర‌వ‌ర్తిస్తే వైసీపీ నేత‌ల తోక‌లు క‌ట్ చేస్తానంటూ ఆయ‌న చుర‌క‌లు అంటించారు చంద్ర‌బాబు. త‌న ప‌ర్య‌ట‌న‌లో వైసీపీ జెండాలు క‌ట్ట‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు.. ఇది ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని ఉసికొల్ప‌డం కాదా? అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version