ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడిన అలీ..!

-

ఎన్నికల్లో పోటీ గురించి ప్రముఖ టాలీవుడ్ నటుడు కమెడియన్ అలీ స్పందించారు రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం నాడు ఎంపీ మార్గాని భరత్ తో కలిసి పాల్గొన్నారు అలీ. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరగలేదని చెప్పారు. ఈ వారం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు.

Comedian Ali to contest as YCP MP

రాజకీయాల్లో ఎవరు ఎక్కడినుండి అయినా పోటీ చేయొచ్చని అన్నారు. ఎన్నికలవేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని అని చెప్పారు. అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాగా సినిమాల్లో మంచి పేరు సంపాదించిన ఆలీకి ప్రజా ప్రతినిధి కావాలని గట్టిగా కోరిక ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news