రాప్తాడు సభపై ఎల్లోమీడియా విషపు రాతలు

-

రాప్తాడులో జరిగిన సిద్ధం సభతో వైసీపీలో మరింత ఉత్సాహం నెలకొంది.లక్షలాది గా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఈ సభను జయప్రదం చేశారు. ఈ సభ ధూమ్ ధామ్ గా జరగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ పెరిగింది. ఇదంతా చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రజల దృష్టిని మరల్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.సిద్ధం సభపై ఎల్లో మీడియాలో అప్పుడే విషపు రాతలు రాస్తోంది.సీఎం వైయస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమలో ఆయనకు ఉన్న పట్టు ఎంతనేది ఈ సభతో తేటతెల్లమైంది. ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ ఒక శాంపిల్ మాత్రమే.అయితే టీడీపీ కూటమి దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం మొదలుపెట్టేసింది.

yellow-media

రాప్తాడులో భూమ్యాకాశాలు ఏకమైనట్లు ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది.ఆపై సీఎం జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన వచ్చింది.జగన్ మాటలకూ అయన పంచ్ డైలాగులకు ప్రజలు ఉర్రూతలూగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.చంద్రబాబు నలభయ్యేళ్ళ పాలనపై అయన వ్యక్తిత్వo పై విమర్శలు గుప్పించారు.ప్రజలను వంచించి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహారణలతో సహా రాప్తాడు వేదికగా జగన్ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు గొప్ప టానిక్ లా పని చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక టీడీపీ ఇప్పటివరకు జరిపిన సభలను చూస్తే ఎక్కడ ఇంత భారీగా జనాలు వచ్చిన సందర్భాలు లేవు. అంతేనా… అసలు బాబు సభలకు జనాలు రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు.అయితే జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపేందుకు టీడీపీ, ఎల్లోమీడియా నానాపాట్లూ పడుతున్నాయి. జగన్ సభకు జనం రాలేదని చెప్పడమే కాదు భయపెట్టి తరలించారని ప్రజలను నమ్మించజూస్తున్నారు.జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఎవరు తగ్గించలేరని వైసీపీ శ్రేణులు అంటున్నారు.ఎల్లో మీడియా రాతలను ప్రజలు పట్టించుకునేoత ఖాళీగా లేరని అంటున్నారు.చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాదరణ పొందడం కష్టమేనని,రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి మళ్లీ సీఎంగా జగనన్నను గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news