ప్రముఖ కమెడియన్ దారుణ హత్య.. గొంతు కోసి మరీ !

-

అఫ్గనిస్తాన్‌ దేశంలో దారుణం చోటు చేసుకుంది. అఫ్గనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌ లో ఖాషా జ్వాన్‌ గా ప్రసిద్ది హాస్యనటుడు నాజర్‌ మొహమ్మద్‌ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది. స్థానిక మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ ఇంట్లో ప్రవేశించి.. గన్నులతో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్‌ ను హత్య చేసినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు.. కాందహార్‌ ప్రావిన్స్‌ లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా… రాడికల్‌ ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. అఫ్గనిస్తాన్‌ భద్రతా దళాలలపై తాలిబన్లు తమ దాడిని తీవ్రతరం చేశారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్గానిస్తాన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news