చెప్పిన మాటలు వినక చెడిపోతాడు ఒకరు. చెప్పుడు మాటలు విని చెడిపోతాడు ఇంకొకడు. కమెడియన్ సునీల్ పరిస్థితి రెండో రకం. నువ్వు తోపు.. తురుమ్‌ఖాన్ అని ఓ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ చెప్పిన మాటలు విని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. గాడిలో పడుతున్నాడనుకుంటే.. మళ్లీ పాత దారిలోకే వెళ్తున్నాడు సునీల్. అటు కమెడియన్‌గా.. ఇటు హీరోగా.. మరోవైపు విలన్‌గా మూడు పడవలపై కాలువేసి… అన్నింటికీ చెడిన రేవడిలా సునీల్ కెరీర్ తయారైంది.
ఒకానొక దశలో సునీల్ హీరోగా నటించిన చిత్రాలేవీ హిట్ కాకపోవడంతో.. ఆఫర్స్ కూడా తగ్గాయి. అదే కమెడియన్‌గా వుంటే.. ఎలా లేదన్నా రోజుకు 2,3 లక్షలు సంపాదించే చాన్స్ పోయిందన్న బాధతో సునీల్ మనసు మళ్లీ కమెడియన్ వేషాలవైపు మళ్లింది. హీరోగా సెటిలవ్వమని సలహా ఇచ్చిన దర్శకుడు కూడా సునీల్‌ను కమెడియన్‌గా నిలబెట్టే ఆఫర్స్ ఇవ్వకుండా మొహం చాటేశాడు.
కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌లో వుండగా హీరోగా యుటర్న్ తీసుకోవడమే సునీల్ కి పెద్ద దెబ్బగా మారింది.
హీరోగా అందాలరాముడు..మర్యాదరామన్న..పూలరంగడు హిట్ అయినా ఆతర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో కెరీయర్ డిఫెన్స్ లో పడింది. డిస్కోరాజాతో విలన్‌గా పరిచయం అయినా సినిమా డిజాస్టర్ అయింది.
కలర్‌ఫొటోలో మరోసారి విలనిజం చూపించినా అది ఓటీటీకే పరిమితం అయింది. ఓ డైరక్టర్ సలహానే సునీల్‌కు శాపంగా మారిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.