ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికాలో దాదాపు నెల రోజుల్లో 15 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పలువురు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచాన్ని బాగా భయపెడుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు దాదాపు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అక్కడ మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇక న్యూయార్క్ నగరంలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. గవర్నర్ కూడా రాజీనామా చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. ఇక రాబోయే నెల రోజులు అమెరికాకు చాలా కీలకమని అక్కడి ప్రజలు కూడా అంటున్నారు. ఎవరూ కూడా ఇప్పుడు అనవసరంగా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
ఇక చైనాలో, భారత్ లో, ఇటలీ, స్పెయిన్ లో కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని ఈ దేశాలకు రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ చేసినా సరే కరోనా ఇప్పుడు నాలుగో దశకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అది జరిగితే దాన్ని ఆపడం చాలా కష్టం అని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి దీనిని ఏ విధంగా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొని నిలబడుతుందో చూడాలి.