ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఎవరికి వారిగా ముందుకి వచ్చి సహాయం చేస్తున్నారు. సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు సహాయం చేయడానికి ముందుకి వస్తున్నారు. దీనితో కరోనా ను ఎదుర్కోవడం లో ప్రభుత్వాలకు సహాయం లభిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు కూడా కాస్త తగ్గుతూ ప్రజలకు మరింత మేలు చేకూర్చే ప్రయత్నాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి.
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని సహాయం చేసారు ఆయన. కరోనా నివారణ గాను చేపడుతున్న చర్యలకు మద్దతుగా ట్విటర్ సీయీవో జాక్ డోర్సీ దాదాపు రూ. 7,600 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఇది ఆయన ఆస్తిలో ఆస్తిలో 28 శాతంగా ఉంది. ఈ డబ్బును తమ సేవా సంస్థ స్టార్ట్ స్మాల్‌కు తరలించారు.
ఈ సొమ్ము మొత్తం కూడా ఆయన తన డిజిటల్ పేమెంట్ సంస్థ… స్క్వేర్ నుంచే ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. “జీవితం చాలా చిన్నదని ఆయన పేర్కొన్నారు. ఇతరుల కోసం మనం చేయగలిగినంతా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్య మరింత మందికి ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కరోనా తగ్గిన తర్వాత బాలికల చదువు ఆరోగ్యానికి నిధులు ఇస్తా అన్నారు.